Saturday, March 5, 2022

మాలలు ఎవరు?

మాలలు ఎవరు? 

మాల అనే పదం ఎలా వచ్చింది? 

మాలలు నాగజాతి వారేనా? 

మాలలు రాజ్యపాలకులా?


"మల అనగా కొండ. మల అనే పదం నుండి వచ్చినదే మాల. "

            మాల, మల్ల,బల్ల,పరాయ,హొళియ,పులియ, మాహార్,పహడియ, ఇలా ఒకే జాతికి చెందిన భారతదేశ మూలనివాసులు వివిధ ప్రాంతాలలో వివిధ పేర్లుతో పిలవబడుతుండేవారు. ఒకే పేరు ప్రాంతాల వారి అలా రూపాంతరం చెందుతుండేది. వీరి వంశ ఆరాధ్య దైవం నగదేవత అని అందుచేత వీరిని నాగజాతి వారుగా చరిత్ర త్రవ్వకాలలో కొన్ని శిలా శాసనాల ద్వారా భావించడం జరిగింది. ఉదాహరణ కు ముందు పోస్ట్ లో తెలిపిన పిశాచాలు అనబడే మూలనివాసులు ఏర్పరుచుకున్న గుంపులుగా, గుంపులు అన్ని చిన్న చిన్న రాజ్యాలగా ఏర్పరుచుకున్నారు. ఆ రాజ్యాలు పైసాచిరాజ్యాలు or నాగరాజ్యాలే అని చెప్పడం జరిగింది 

ఆధారాలు:-

1.ఈ రాజ్యల రాజ్య సిహ్నం నాగుపాము

2. విదేశాలకు ప్రయాణించే నావల జెండాలపై నగసర్పం

3 విదేశీ చారిత్రక గ్రంధాలను పరిశీలించి విశేశాలు

4 రాతి పలకాల పై సర్పాలు చెక్కబడిన అవశేషాలు దేశంలో పలు చోట్ల ఇప్పటికీ బైట పడుచున్నాయి.   

ఈ నాగరాజ్యాలు గురించి చరిత్రలో మరుగున పడిన గాని రామాయణం, మహాభారతం, భాగవతం, పురానఇతిహాసాల్లో వీటి ప్రస్తావన తేక తప్పడం లేదు. వీటి అన్నింటి ఆధారంగా నాగరాజ్యాలు ఉండేవి అని ఆ రాజ్య ప్రజలు నాగులని వారు మూలనివాసి మాల లని ధృవీకరించడం జరిగింది.   


మాలలు రాజ్య పాలకులు:-

   భారసివ వంశీయుడు ఐన భవనాగుడు, విగ్రహ రాజైన చహామణుడు, బళ్ళారి రాజ్యపాలకుడు స్కంధనాగుడు, పుళింధ(నేటి ఆంధ్ర) రాజ్యపాలకుడు శివకంద నాగశ్రీ, లాహోర్ రాజ్యపాలకుడు నాగబటుడు, అంతర్వేది పాలకుడు సర్వనాగుడు, థెక్కరి(నేటి బెంగాల్) పాలకుడు ఘోషనాగుడు,నేపాల్ కి కర్కోటకనాగుడు, కాశ్మిర్ పాలకుడు నీలనాగుడు ఇలా నాగపూర్ నుండి నాగపట్నం వరకు అనేక రాజ్య పాలకులంతా నగజాతివారే....


నాగరాజ్యాలు విచ్చిన్నం:-

తరువాత కాలంలో విదేశీయులు దాడులు జరిపి కొన్ని నాగరాజ్యాలను స్వాధీనపరుచుకున్నారు, కొన్ని చోట్ల బలమైన నాగరాజ్యాల రాకుమారులకి విదేశీయుల కుమార్తెలను ఇచ్చి మరికొన్ని చోట్ల రాకుమార్తెలను విదేశీ చక్రవర్తులు వివాహాలు చేసుకుని బంధుత్వాలు కలుపుకుని చివరికి ఆ రాజ్యాలను కూడా సామంత రాజ్యాలుగా కలిపేసుకున్నారు.. ఆనాటి నాగరాజ్య పాలకులైన నాగులు నేటి మాలలు అని నిర్ధారించడం జరిగింది.


నేటి పరిస్థితి:-

అలా పోగొట్టుకున్న మా నాగరాజ్యాలు సంసృతిని తగలబెట్టి చివరికి మా పూర్వ మూలనివాసులను మీ చరిత్ర పుటల్లో అస్పృస్యులుగా,చండాలులుగా, పిశాచాలుగా, రాక్షసులుగా, అంతరానివారిగా లికించి మా మూలనివాసుల వర్దంతి లను పండుగలుగా సృష్టించి మా చేతే ఉత్సవాలు జరిపిస్తున్నారు... మా ఆనాటి రాజ్యాలు చివరికి మీ మనువాదుల గుప్పెట్లో పెట్టుకుని మమ్ములను నేటికి బానిసలుగా చూస్తూ మాతోనే జై జై లు కొట్టించుకుంటున్నారు 


నాటి నాగరాజ్యాలే...... నేటి మాల రాజ్యాలు

నాటి నాగచిహ్నాల జెండాలు..నేటి నీలి జెండాలు

జై భీమ్ 

 జై మాల ,

 జై నీలి జెండా


సోర్స్ :- DrRaja Babu Adidela

మల్లల చరిత్ర(మాలల చరిత్ర) భాగం-1

 మల్లల చరిత్ర .. మాలజాతి మూలాలు - Part-01 
 👉మల్ల జాతి పుట్టుపూర్వోత్తరాలు 👈 
మల్ల జాతి భారత ఉపఖండంలో అత్యంత ప్రాచీన జాతి.. మల్ల అనే పదానికి ప్రాకృతిక అర్థం పర్వతము.. (ఉదాహరణకు - హిమాలయ, మలయ మారుతం,, తిరుమలై, ఆన్నామలై, మలైయాలం, మలయబారు తీరం).. వీరి ప్రాచీన నామం నాగజాతిగా గుర్తించబడుతుంది.. నాగము అనే పదానికి కూడా ప్రాకృతిక అర్ధం పర్వతము.. మల్ల జాతి పాలకులుగా గుర్తింపబడినవారంతా,, తమ పూర్వికులు, తమ మూలాల నాగజాతివిగా చెప్పుకున్నారు... (ఉదాహరణకు - పల్లవులు, వేంగి చాళుక్యులు,, ఉత్తరాది మల్ల రాజ్యం,, పెరుమాళ్ వ్యవస్థ, శ్రీలంక ద్వీపాపు నాగ పాలకులు- పూర్తి వివరాలు వచ్చే శీర్షికలో లోతుగా చర్చించబడతాయి).. 
👉 నాగుల చరిత్ర - కొన్ని విశిష్ట అంశాలు 👈 
నాగజాతి భారతదేశ చరిత్రలో అత్యంత ప్రశస్తి కలిగిన జాతిగా గుర్తించబడింది.. అత్యంత గుప్తమైన జాతిగా కూడా చర్చించబడింది.. ఇప్పుడు లభ్యం అవుతున్న వేద, పురాణ, ఇతిహాసాల్లో నాగజాతి గురించి ప్రస్తావనలు ఉన్నా,, అవి చరిత్ర నిర్మాణానికి సరిపోయేవి కాదు.. వేదకాలం కంటే పురాతనమైనదైన తమిళ సంగం సాహిత్యంలో నాగ జాతి చరిత్ర గురించి ఎన్నో అంశాలు తెలుస్తున్నాయి.. చరిత్రకారులు చిలుకూరి వీరభద్రరావు గారి ఆంధ్రుల చరిత్ర.. 5 వ ప్రాకారణం, పూర్తిగా నాగుల విశేషాలకు కేటాయించబడింది.. వారి ప్రకారం.. 
▪️ప్రాథమిక ఆర్యులు సింధు నది దాటి వచ్చి మహానది - సరస్వతి నదుల మధ్య స్థిరనివాసాలు ఏర్పాటు చేసుకోవడానికి వెయ్యేళ్ళ ముందే,, ఆర్యులలో మరొశాఖవారు గంగాతీరము చేరుకుని కురు, పంచాల దేశములలో నివసించడం మొదలుపెట్టిన కాలంలోనే.. నాగులు అనే జాతి వారు హిమాలయ పర్వతం నుండి,, వింధ్యా పర్వత ప్రాంతంవరకు పాలన చేస్తూ ఉన్నారు అని.. రిగ్వేదంలో చెప్పబడి ఉంది.. ఆర్య తెగలకు నాగ తెగలకు జరిగిన ఘర్షణలు రిగ్వేదంలో, మహాభారతంలో తెలుపబడ్డాయి.. 
▪️అయినప్పటికీ హైందవ చరిత్రకారులు కానీ,, పాశ్చాత్య చరిత్రకారులుగానీ వీరి గురించి వివరంగా చెప్పే ప్రయత్నం ఎందుకు చేయలేదు తెలియడం లేదు.. ఆ ప్రయత్నం చేయకపోవడం వల్లనే,, ఈ నాగజాతి ఒక గుప్తమైన జాతిగా మిగిలిపోయింది.. వీరి ఉనికి వెతుక్కుంటే తప్ప దొరకని పరిస్థితి కనిపిస్తోంది.. 
▪️పురాణేతిహాసాల్లో చెప్పబడిన నాగులు ఈ నాగులే కానీ,, పాతాళంలో ఉండే నాగుపాములు కాదు.. నగము అనగా పర్వతము.. పర్వత ప్రాంతం నుండి వచ్చినవారు కావడం చేత వీరిని నాగులు, మల్లలు అని పిలువబడ్డారు.. 
▪️ఆర్య తెగలతో ఘర్షణ కారణంగా,, ఈ నాగజాతి ఉనికి, దాని విశేషాల చుట్టూ అత్యంత గోప్యత నిర్మించి పెట్టినప్పటికీ,, ఈ నాగజాతి ప్రభావం దక్షిణ భారతదేశ సాంప్రదయాల్లో మేళవింపు అయ్యి కనిపిస్తాయి.. దక్షిణ భారతదేశ సంప్రదాయాలు అన్ని నిజానికి ఈ నాగజాతి సంప్రదాయాలే.. వీరు చెట్లను పూజించారు కాబట్టే, దక్షిణభారతదేశంలో ఇప్పటికీ ప్రాచీన మతంలో చెట్లను పూజించే సంప్రదాయం ఉంది.. వీళ్ళు జంతువులను పూజించేవారు కాబట్టే,, ప్రాచీనమతంలో ఇప్పటికీ జంతువులను పూజించే ఆచారం ఉంది.. అసలు "నాగరికత"" అనే పేరు కూడా నాగుల పేరునే సూచిస్తుంది.. సాహిత్యంలో తెలుగు భాషకు సంబంధించిన మొదటి పదంగా చెప్పబడే "నాగబు" కూడా నాగ పదాన్నే సూచిస్తుంది.. ఇలా దక్షిణ భారత సంప్రదాయం మొత్తం నాగజాతి సాంప్రదయమే అనేది చారిత్రక సత్యం.. వీరి గుర్తుగా చేసుకునే "నాగుల చవితి" మహారాష్ట్ర ప్రాంతంలో చేసుకునే "నాగుల పంచమి" వలన వీరి ఉనికి దక్షిణ భారతదేశ వ్యాప్తం అని తెలుస్తుంది.. 
▪️ఆర్య తెగలకు నాగులకు జరిగిన ఘర్షణకు ఒక ఉదాహారణ.. మహాభారతంలో "ఖాండవ వన దహనం".. ఇప్ప్పుడు హస్తిన(ఢిల్లీ) ప్రాంతము ఖాండవ వనముగా నాగుల పాలనలో ఉండేది.. ఈ ఖాండవవనంలో పాండవుల రాజధాని ఇంద్రప్రస్తపూరము నిర్మించడానికి,, అర్జునుడు శ్రీకృష్ణుడి సహాయంతో,, నాగుల మీద యుద్ధం చేసి,, వారిని ఓడించి,, ఖండవవనాన్ని దహనం చేసి ,, అక్కడ తమ రాజప్రసాదం నిర్మించుకున్నారు.. 
👉 సమకాలీన చరిత్రలో నాగుల పాలన ప్రస్తావన 👈 నాగుల పాలన గురించిన ప్రస్తావన అత్యధికంగా బౌద్ధ సాహిత్యలో లభిస్తుంది.. తమిళ, సింహళం ప్రాంతంలో నాగులు బుద్ధుడు ఏ విధంగా బౌద్ధంలోకి తీసుకువచ్చాడు అనే విశేషాలు,, బౌద్ధ గ్రంధాలైన రత్నావలి, మహావంశంలో చాలా చక్కగా పొందుపరచబడి ఉన్నాయి.. 
▪️మాహవంశం ఏమి చెబుతుంది అంటే,, సిద్ధార్థుడు గౌతముడిగా మారాక నాగుల పట్ల ప్రేమతో నాగరాజ్యము చూడడానికి వెళ్ళాడు.. పంచశత యోజనాల విస్తీర్ణం కలిగిన నాగ రాజ్యాన్ని మహోదరుడు పాలిస్తున్నాడు.. ఆ కాలంలో రాజు వారసుల్లో వజ్రసింహాసనం కోసం గొడవలు జరుగుతున్నాయి.. వాటిని పరిష్కరించిన బుద్ధుడికే వారు ఆ సింహాసనం ఇచ్చేసి,, ఆ సింహాసనం నుండి బుద్ధుడు ఇచ్చిన ఉపదేశాల ద్వారా కొన్ని కోట్ల మంది నాగులు ఏ విధంగా బౌద్ధంలోకి మారారో మహావంశం చెబుతుంది.. వారికి బోధి వృక్షాన్ని ప్రసాదించి బుద్ధుడు అక్కడ నుండి సింహళ ద్వీపానికి ప్రయాణం అవుతాడు.. అక్కడ సింహాళ ద్వీపాన్ని, మల్ల నాగుడు, చండనాగుడు,, కూడనాగుడు పాలిస్తున్నరు.. 
▪️ బుద్ధుడు తన తదనంతరం,, తన ఆస్తికల మీద హక్కులు తన నాగజాతి బంధువులైన మాల్లలకు అప్పగించి,, తన చివరి రోజులు మల్లరాజ్యంలో గడిపారని.. బుద్ధుని తదనంతరం ఆయన ఆస్తికల మీద ప్రపంచ నలుమూలల చైత్యాల నిర్మాణం మల్ల నాయకులే బాధ్యత తీసుకున్నారని,, బాబాసాహెబ్ అంబేద్కర్ తన.. బుద్ధ అండ్ ధమ్మా పుస్తకంలో వివరంగా పొందుపరిచారు.. 
▪️తమిళ సంగం సాహిత్య కావ్యం, ""చిలప్పాదికారం""లో, ప్రాచీన కావేరి పట్టణము నాగుల నివాస ప్రాంతము అని, నాగులు ముఖ్య పట్టణము అని చెబుతుంది.. 
▪️మనిమేఖలై అనే కావ్యము,, చోళ రాజులు నాగజాతి మధ్య వివాహ సంబంధాల గురించి చెబుతుంది.. అందుబాటులో ఉన్న చరిత్రకకాలంలో ఈ నాగజాతీయులే,, పల్లవులు,, వారే మాలల పూర్వీకులుగా చెప్పడానికి ఆధారము ఈ మనిమేఖలై కావ్యము.. 
▪️పల్లవులు తమకు ఇచ్చుకునే బిరుదులలో మల్ల అని పెట్టుకోవడం పరిపాటి,, ఇదే సంప్రదాయం పల్లవరాజ్యం అంతం అయ్యాక వేంగి చాళుక్యులు మొదలుబెట్టారు.. ఉదాహరణకు;- పల్లవ రాజులు;- ""శత్రు మల్ల - మహేంద్ర వర్మ -1"", ""ఏక మల్ల పరమేశ్వర-III"", ,అందరి రాజులకు ముందు "" మహా మల్ల"" చాళుక్య రాజులు;- ""మహా మల్ల విక్రమాదిత్య-I"", ""త్రిభువన మల్ల విక్రమాదిత్య- V, VI"", ""జగదేక మల్ల జయసింహ-III"" ""అహవ మల్ల"", ""త్రిలోక మల్ల"", "భూలోక మల్ల సోమేశ్వర-III",.. 
▪️ ఇదే పల్లవులు తమ సామర్ధ్య స్థాయి చూపడానికి.. మహామల్లపురం(మహాబలిపురం) అనే సుందర నగరాన్ని నిర్మించారు అనేది తెలిసిందే..(పల్లవుల గురించి క్లుప్తంగా మరో శీర్షికలో తెలుసుకుందాం).. 
▪️పదిహేనవ శాతాబ్దపు నెల్లూరు దర్శి రాజైన ఆసనదేవమహారాజు శాలివాహన శకం 1357లో చెరువులు తవ్వించిన సందర్భంలో వేయించిన శాసనం ప్రకారం,, ఆ రోజుల్లో ఓలియనాగులు, సంగనాగులు, ముగలినాగులు అనే నాగుల తెగలు ఉన్నట్టు,, నెల్లూరు పాలకులు కూడా నాగ వంశస్తులే అని చెప్పబడింది.. ఆ శాసనం ద్వారా.. వీరు కాకతీయ రాజులకు బంధువర్గమని,, సామంతులు అని తెలుస్తుంది.. ఈ శాసనం ప్రకారం కర్ణాటక ప్రాంత హోలియాలు(కన్నడ మాలలు), హోయసాల రాజ్యపు పాలకులు అనే విషయం అర్థం అవుతుంది.. 
👉 నాగులు ఆంధ్రులే 👈 
నాగులు ఆంధ్రప్రాంతపువారేనను పైన చెప్పిన ఉదంతాలతోపాటు, అమరావతీ స్థూపాములో నాగుల జిత్తరువులవలన తెలుస్తున్నది.. ఈ కారణం చేతనే,, ఐతరేయ బ్రాహ్మణంలో ఆంధ్రులు కిరాతజాతుల కింద చేర్చబడ్డారు,, వింధ్యా పర్వత ప్రాంతం నుండి,, కావేరీ ప్రాంతం వరకు విస్తరించి పాలన చేసిన వీరే,, ఇప్పుడు మాలలుగా,, పరయాలుగా, పల్లార్ లుగా,, హోలియాలుగా,, మహార్లుగా పిలువబడుతున్నారు.. 
👉 తమిళ సంగం విభజన సూత్రీకరణ 👈 
తమిళ సంగం చారిత్రక ఆధారాలు ఇప్పుటి కులాలను,, చారిత్రక జాతీయత ఆధారంగా రెండుగా విభజించింది.. తమిళ ప్రాంతంలో ఇప్పటికీ ఈ విభజన వాడుకలో ఉంది.. 1. వలంగాయ్(కుడిచేతి వైపు) కులాలు.. ఇవి ముఖ్యంగా వ్యవసాయం చుట్టూ వృత్తులు కేటాయించబడిన కులాలు.. ఇవి ఎడమచేతి కులాల కంటే ఉన్నతమైనవిగా భావించబడ్డాయి.. ఇప్పటి దళిత కులాలైన పరయా (పెరియానాడు మాల) కులం ఇందులో అతిముఖ్య కులము.. దానితో పాటు,, మల్లార్, వెళ్ళలార్, మారవార్ 
2. ఇడంగై (ఎడమచేతి వైపు) కులాలు.. ఉత్పత్తి వృత్తి ఆధారిత కులాలు ఇందులో ముఖ్యమైనవి.. ఇందులో అరుంధతీయార్(మాదిగ) కులంతో పాటు,, చాకలి, మంగలి, కాంశాలి సంబంధిత కులాలు అన్ని పరిగణించబడతాయి.. సంగం శకంలో మాల సంబంధించిన కులాలు ఉన్నతనైనవిగా భావించబడ్డాయి అనే నిజానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ.. 
((మిగతా అంశాలు వచ్చే శీర్షికల్లో)).....

మాల మల్లయోదులపై రెంజర్ల రాజేష్ గారు పాడిన పాట

మాల అనే పదం ఎలా వచ్చింది?

తెలుగు పర్యాయపద నిఘంటువు మాల అనే కులం మల్ల అనే పదం నుండి వచ్చింది. మల్లయుద్ధం లో మహా యోధులు మల్ల లే నాటి మల్ల నేటి వాడుకలో మాలగా మారింది.రాజ్యపాలన చేసిన మహా యోధులు మాలలు.

మాలల వృత్తులు

 ⚛️🔷 మాలలు - అనుబంధ వ్యవస్థ 🔷⚛️ ⚛️🔷 మాల కులపు వృత్తుల చరిత్ర 🔷⚛️ 🔹👉 కులవ్యవస్థకు ప్రత్యామ్నాయ వ్యవస్థ..మాల అనుబంధ వ్యవస్థ 👈🔹       మ...