Wednesday, May 31, 2023

మాలల వృత్తులు

 ⚛️🔷 మాలలు - అనుబంధ వ్యవస్థ 🔷⚛️

⚛️🔷 మాల కులపు వృత్తుల చరిత్ర 🔷⚛️


🔹👉 కులవ్యవస్థకు ప్రత్యామ్నాయ వ్యవస్థ..మాల అనుబంధ వ్యవస్థ 👈🔹


      మాలలు హిందూ కులవ్యవస్థకు సమాంతరంగా, ప్రత్యామ్నాయంగా ఒక అనుబంధ వ్యవస్థను నిర్మించుకున్నారు.. ఈ అనుబంధ వ్యవస్థలోని ప్రత్యేక వర్గాలు ఉనికిలో మాలల ఘనమైన చరిత్ర దాగి ఉంది... ప్రస్తుతం ఈ అనుబంధ వ్యవస్థలోని కులాలను ఉపకులాలు అని పేర్కొంటున్నప్పటికీ.. నిజానికి అవి మాల జాతిలోనే వివిధ శాఖలుగా గుర్తించాలి.. 


       మాల కుల శాఖల్లో.. ఒక్కో కులం, దాని వృత్తి,, మాలల చరిత్ర తెలుసుకోవడానికి చాలా దోహదపడుతుంది.. మాలలు తమ బంధువుల గుర్తించి, వారి చరిత్ర మరియు గొప్పతనం గురించి తప్పకుండా తెలుసుకోవాలి.. 


🔹👉 మాల బంధుశాఖలు - వాటి చరిత్ర 👈🔹


1. మాల దాసరి - వీరు మాలల్లో పూజారి మరియు మత గురువులు.. వీరు తమ జీవితాన్ని ఆధ్యాత్మిక వృత్తికి అప్పగించినవారు... మాలల్లో పిల్లలకు తల నీలాలు తీయించడం, నామకరణం నుండి ప్రతీ శుభకార్యం మాల దాసరి ఆధ్వర్యంలో జరిగేది.. వీరి పూజా విధానం "చెన్నుడు లేదా పెద్ద ముని" చుట్టు కేంద్రీకృతం అయ్యి ఉంటుంది.. చెన్నుడు శివుడికి మూడవ కుమారుడిని, మాలలు ఆ చెన్నుడు వారసులు అని వీరి నమ్మకం.. 


      మాల దాసరులు మాల కులంలో ఆరోహణ క్రమం (heirarchy)లో ఉన్నతమైన స్థానంగా భావించబడేది.. ఒక్కో మాల దాసరి కింద 4, 5 గ్రామాలు ఉండేవి.. అందులోని మాలల కుటుంబాలకు సంబంధించిన ప్రతీ అంశము మాల దాసరి కటస్తం చేసి ఉండేవాడు.. 


2. మాల పంబల / పరయా :- వీరు మాలల్లో వైద్య వర్గం వారు.. వీరే ఆయుర్వేద వైద్యానికి పితామహులు... వీరు సిద్ధ వైద్యం (ప్రకృతి వైద్యం), పసరు వైద్యంలో నిపుణులుగా ఉండేవారు.. వీరు మాలలకే కాక మొత్తం గ్రామానికి వైద్యం అందించేవారు.. ఇప్పటికి కూడా చాలా గ్రామాల్లో పాము కాటుకి, ఇంకా రకరకాల జబ్బులకు, పశురోగాలకు వీరినే సంప్రదించడం కమిపిస్తుంది..


      వీరు యంత్ర మంత్రం తంత్ర విద్యాలలో మంచి పట్టుగలవారు.. వీరు కొన్ని శతాబ్దాల పాటు, ప్రజల ఆయురారోగ్యాల కోసం కృషి చేసినవారు.. 


3. బైండ్ల మాల :- బైండ్ల శాఖ మాలల్లో అతి ముఖ్యమైన శాఖ.. మాల దాసరి వర్గానికి ఉపశాఖగా ఉండే వీరు.. మాలలకు సంబంధించిన అన్ని పండుగల ఆచారాలను రూపొందించి అమలు జరిపే బాధ్యత గలవారు.. అంటువ్యాధులు ప్రభలినప్పుడు వాటి నివారణకు పూర్వం జంతు బలులు ఇవ్వడం అనే ఆనవాయితీ ఉండేది... బైండ్లవారు.. అంటువ్యాధులు మాలల వరకు రాకుండా నిరోదించడంలో కీలక పాత్ర పోషించారు..


4. మాల జంగాలు / హోలియలు :- ఇంకో అతి ముఖ్యమైన శాఖ మాల జంగాలు,, వీరు వీరశైవ అనుయాయులు.. వీరు మాలల్లో భైరవ సాంప్రదాయనికి ఆద్యులు.. మహా కాల భైరవుడు అయిన శివుడి వారసులుగా ఈ మాల భైరవులు, మాల నివాసాలు, శివుని మందిరాలకు, స్మాశాన వాటికలకు రక్షణగా ఉండేవారు.. యుద్ధ సమయాల్లో శత్రువుల నుండి మాల నివాసాలు రక్షించడంలో వీరు పోషించిన పాత్ర ఎంతో కీలకం అయింది.. సంచార జీవితం గడిపిన వీరు తమ బ్రతుకుదేరువు కోసం పూర్తిగా గ్రామీణ మాలల మీద ఆధారపడేవారు..


5. మాల మాష్టి :- మాలల యుద్ధ నైపుణ్యాలు, యుద్ధ విన్యాసాలను పతాక స్థాయికి తీసుకుపోయిన శాఖ మాల మాష్టి.. వీరి యుద్ధ నైపుణ్యాలను గుర్తించి,, వీరిని గ్రామ రక్షకులుగా, తలరీలుగా ఉద్యోగాలు కల్పించినట్టు కృష్ణదేవరాయలు ఆముక్తమాల్యద "మాల కుమారుని చరిత్ర" ద్వారా తెలుస్తుంది.. ఇప్పటికీ వీరు చేసే యుద్ధ విన్యాసాలు అబ్బుర పరుస్తాయి.. 


         ఒకప్పుడు గొప్ప గొప్ప సైన్యాలకే యుద్ధ గురువులుగా ఉన్న వీరు, ఇప్పుడు రోడ్ల వెంబడి, సర్కస్ విన్యాసాలు చేస్తూ కనిపిస్తారు.. నిజానికి వీరిని ఇప్పుడు ప్రభుత్వం గనక ప్రోత్సాహం అందిస్తే.. జిమ్నాస్టిక్స్ లాంటి ఆటల్లో పథకాల పంట పండించే సత్తా గలవారు.. 


6. నేతకాని :- వీరు మాలల్లో సాలె వృత్తి స్వీకరించినవారు.. వీరు తర్వాతి క్రమంలో మహార్ కులంగా రూపాంతరం చెందారు.. వీరు మాల - మహార్ కులాలకు అనుసంధాణ కులంగా ఉన్నారు... వీరి నేసిన కాటన్ బట్టలు యూరోప్ లో విరివిగా అమ్ముడుపోయేవని పోర్చుగీస్ యాత్రికుడు డొమింగో పీస్ (Domingo Peas) రాశారు.. 


7. మాల దండెం :- మాలల్లో వ్యవసాయ వృత్తిని స్వీకరించిన శాఖ దండెం కులం.. సనాతన హైందవ సంస్కృతి విస్తరించాక వీరు, భూస్వాముల స్థాయి నుండి, పొలంలో జీతగాళ్ల స్థాయికి దిగాల్సి వచ్చింది.. ఒకానొక సందర్భంలో.. వీరి అమ్మకం కొనుగోలు కూడా జరిగేది.. బ్రిటిష్ ఆగమనం తర్వాత ఈ బానిసత్వానికి వ్యతిరేకంగా చట్టాలు చేయబడ్డాయి..


8. మాల పోతురాజు / గోసంగి :- వీరు శైవ సాంప్రదాయంలో అత్యంత ఉన్నతమైన శాఖగా ఉండేవారు.. వీరు మొదటగా, బోయలతో పాటుగా బందిపోటు వర్గాలుగా ఉండి.. గెరిల్లా మెరుపు దాడుల్లో సిద్ధహస్తులుగా ఉండేవారు.. వీరి సహకారంతోనే ఛత్రపతి శివాజీ, ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి, కన్నెగంటి హనుమంతు, రుద్రమ దేవి, ప్రతాప రుద్రుడు వంటివారు.. గెరిల్లా దాడుల ద్వారా.. యుద్దాలు గెలిచారు.. 


      వీరు గ్రామ తిరునాళ్ళు పండుగలలో, పోతురాజు ఆచారాన్ని పాటించేవారు.. బలుల ద్వారా గ్రామ దేవతలకు సంతర్పణ ఇచ్చి, గ్రమ బొడ్డురాయి, పొలిమేర నిర్ణయించడం వీరి బాధ్యత..


🔹👉 మాలల శాఖల్లోనే మాలల స్వీకరించిన వృత్తుల చరిత్ర 👈🔹


        ఒక నిర్ధిష్ట కుల వృత్తి లేని మాలలు, ఒక్కో సమయంలో ఒక్కో వృత్తి స్వీకరించినట్టు, మాల శాఖల చరిత్ర చూస్తే తెలుస్తుంది.. ఏది ఏమైనప్పటికీ.. మాలలకు అన్నింటికంటే ఎక్కువగా కల్పించబడిన బాధ్యత.. గ్రామ రక్షణగా తెలుస్తుంది.. మాలల యుద్ధ విద్య నైపుణ్యం వల్లనే, మాలలకు గ్రామ రక్షకులుగా బాధ్యతలు అప్పగించినట్టు చెప్పవచ్చు.. 


      ఇప్పుడు స్వతంత్ర కులాలుగా కనిపిస్తున్న పైన చెప్పబడిన కులాలను, మనకు సంబంధం లేని కులాలు అనే అపోహ నుండి బయటపడి,, అవి మాల కులంలోని శాఖలు అని ఈ జనరేషన్ తెలుసుకుని,, ఈ కులాలను తమ బంధువులుగా తిరిగి స్వీకరించి,, జాతి ఐక్యతకు తోడ్పడాల్సిన అవసరం ఉంది.. 


 👉👉 మాల బంధువులు అందరూ ఐక్యం అయితే మాల జాతికి పూర్వవైభవం రావడం ఖాయం.. 


👉👉👉👉 మాలల ఈ స్థాయి వెనకబాటుకి ముఖ్య కారణం,, మాలలు తమ మూలాలను మర్చిపోవడమే.. ఆ మూలాలను మళ్లీ బయటకు తీసుకొచ్చే ప్రయత్నమే.. ఈ శీర్షిక...

No comments:

Post a Comment

మాలల వృత్తులు

 ⚛️🔷 మాలలు - అనుబంధ వ్యవస్థ 🔷⚛️ ⚛️🔷 మాల కులపు వృత్తుల చరిత్ర 🔷⚛️ 🔹👉 కులవ్యవస్థకు ప్రత్యామ్నాయ వ్యవస్థ..మాల అనుబంధ వ్యవస్థ 👈🔹       మ...