Wednesday, May 31, 2023

మాలల వృత్తులు

 ⚛️🔷 మాలలు - అనుబంధ వ్యవస్థ 🔷⚛️

⚛️🔷 మాల కులపు వృత్తుల చరిత్ర 🔷⚛️


🔹👉 కులవ్యవస్థకు ప్రత్యామ్నాయ వ్యవస్థ..మాల అనుబంధ వ్యవస్థ 👈🔹


      మాలలు హిందూ కులవ్యవస్థకు సమాంతరంగా, ప్రత్యామ్నాయంగా ఒక అనుబంధ వ్యవస్థను నిర్మించుకున్నారు.. ఈ అనుబంధ వ్యవస్థలోని ప్రత్యేక వర్గాలు ఉనికిలో మాలల ఘనమైన చరిత్ర దాగి ఉంది... ప్రస్తుతం ఈ అనుబంధ వ్యవస్థలోని కులాలను ఉపకులాలు అని పేర్కొంటున్నప్పటికీ.. నిజానికి అవి మాల జాతిలోనే వివిధ శాఖలుగా గుర్తించాలి.. 


       మాల కుల శాఖల్లో.. ఒక్కో కులం, దాని వృత్తి,, మాలల చరిత్ర తెలుసుకోవడానికి చాలా దోహదపడుతుంది.. మాలలు తమ బంధువుల గుర్తించి, వారి చరిత్ర మరియు గొప్పతనం గురించి తప్పకుండా తెలుసుకోవాలి.. 


🔹👉 మాల బంధుశాఖలు - వాటి చరిత్ర 👈🔹


1. మాల దాసరి - వీరు మాలల్లో పూజారి మరియు మత గురువులు.. వీరు తమ జీవితాన్ని ఆధ్యాత్మిక వృత్తికి అప్పగించినవారు... మాలల్లో పిల్లలకు తల నీలాలు తీయించడం, నామకరణం నుండి ప్రతీ శుభకార్యం మాల దాసరి ఆధ్వర్యంలో జరిగేది.. వీరి పూజా విధానం "చెన్నుడు లేదా పెద్ద ముని" చుట్టు కేంద్రీకృతం అయ్యి ఉంటుంది.. చెన్నుడు శివుడికి మూడవ కుమారుడిని, మాలలు ఆ చెన్నుడు వారసులు అని వీరి నమ్మకం.. 


      మాల దాసరులు మాల కులంలో ఆరోహణ క్రమం (heirarchy)లో ఉన్నతమైన స్థానంగా భావించబడేది.. ఒక్కో మాల దాసరి కింద 4, 5 గ్రామాలు ఉండేవి.. అందులోని మాలల కుటుంబాలకు సంబంధించిన ప్రతీ అంశము మాల దాసరి కటస్తం చేసి ఉండేవాడు.. 


2. మాల పంబల / పరయా :- వీరు మాలల్లో వైద్య వర్గం వారు.. వీరే ఆయుర్వేద వైద్యానికి పితామహులు... వీరు సిద్ధ వైద్యం (ప్రకృతి వైద్యం), పసరు వైద్యంలో నిపుణులుగా ఉండేవారు.. వీరు మాలలకే కాక మొత్తం గ్రామానికి వైద్యం అందించేవారు.. ఇప్పటికి కూడా చాలా గ్రామాల్లో పాము కాటుకి, ఇంకా రకరకాల జబ్బులకు, పశురోగాలకు వీరినే సంప్రదించడం కమిపిస్తుంది..


      వీరు యంత్ర మంత్రం తంత్ర విద్యాలలో మంచి పట్టుగలవారు.. వీరు కొన్ని శతాబ్దాల పాటు, ప్రజల ఆయురారోగ్యాల కోసం కృషి చేసినవారు.. 


3. బైండ్ల మాల :- బైండ్ల శాఖ మాలల్లో అతి ముఖ్యమైన శాఖ.. మాల దాసరి వర్గానికి ఉపశాఖగా ఉండే వీరు.. మాలలకు సంబంధించిన అన్ని పండుగల ఆచారాలను రూపొందించి అమలు జరిపే బాధ్యత గలవారు.. అంటువ్యాధులు ప్రభలినప్పుడు వాటి నివారణకు పూర్వం జంతు బలులు ఇవ్వడం అనే ఆనవాయితీ ఉండేది... బైండ్లవారు.. అంటువ్యాధులు మాలల వరకు రాకుండా నిరోదించడంలో కీలక పాత్ర పోషించారు..


4. మాల జంగాలు / హోలియలు :- ఇంకో అతి ముఖ్యమైన శాఖ మాల జంగాలు,, వీరు వీరశైవ అనుయాయులు.. వీరు మాలల్లో భైరవ సాంప్రదాయనికి ఆద్యులు.. మహా కాల భైరవుడు అయిన శివుడి వారసులుగా ఈ మాల భైరవులు, మాల నివాసాలు, శివుని మందిరాలకు, స్మాశాన వాటికలకు రక్షణగా ఉండేవారు.. యుద్ధ సమయాల్లో శత్రువుల నుండి మాల నివాసాలు రక్షించడంలో వీరు పోషించిన పాత్ర ఎంతో కీలకం అయింది.. సంచార జీవితం గడిపిన వీరు తమ బ్రతుకుదేరువు కోసం పూర్తిగా గ్రామీణ మాలల మీద ఆధారపడేవారు..


5. మాల మాష్టి :- మాలల యుద్ధ నైపుణ్యాలు, యుద్ధ విన్యాసాలను పతాక స్థాయికి తీసుకుపోయిన శాఖ మాల మాష్టి.. వీరి యుద్ధ నైపుణ్యాలను గుర్తించి,, వీరిని గ్రామ రక్షకులుగా, తలరీలుగా ఉద్యోగాలు కల్పించినట్టు కృష్ణదేవరాయలు ఆముక్తమాల్యద "మాల కుమారుని చరిత్ర" ద్వారా తెలుస్తుంది.. ఇప్పటికీ వీరు చేసే యుద్ధ విన్యాసాలు అబ్బుర పరుస్తాయి.. 


         ఒకప్పుడు గొప్ప గొప్ప సైన్యాలకే యుద్ధ గురువులుగా ఉన్న వీరు, ఇప్పుడు రోడ్ల వెంబడి, సర్కస్ విన్యాసాలు చేస్తూ కనిపిస్తారు.. నిజానికి వీరిని ఇప్పుడు ప్రభుత్వం గనక ప్రోత్సాహం అందిస్తే.. జిమ్నాస్టిక్స్ లాంటి ఆటల్లో పథకాల పంట పండించే సత్తా గలవారు.. 


6. నేతకాని :- వీరు మాలల్లో సాలె వృత్తి స్వీకరించినవారు.. వీరు తర్వాతి క్రమంలో మహార్ కులంగా రూపాంతరం చెందారు.. వీరు మాల - మహార్ కులాలకు అనుసంధాణ కులంగా ఉన్నారు... వీరి నేసిన కాటన్ బట్టలు యూరోప్ లో విరివిగా అమ్ముడుపోయేవని పోర్చుగీస్ యాత్రికుడు డొమింగో పీస్ (Domingo Peas) రాశారు.. 


7. మాల దండెం :- మాలల్లో వ్యవసాయ వృత్తిని స్వీకరించిన శాఖ దండెం కులం.. సనాతన హైందవ సంస్కృతి విస్తరించాక వీరు, భూస్వాముల స్థాయి నుండి, పొలంలో జీతగాళ్ల స్థాయికి దిగాల్సి వచ్చింది.. ఒకానొక సందర్భంలో.. వీరి అమ్మకం కొనుగోలు కూడా జరిగేది.. బ్రిటిష్ ఆగమనం తర్వాత ఈ బానిసత్వానికి వ్యతిరేకంగా చట్టాలు చేయబడ్డాయి..


8. మాల పోతురాజు / గోసంగి :- వీరు శైవ సాంప్రదాయంలో అత్యంత ఉన్నతమైన శాఖగా ఉండేవారు.. వీరు మొదటగా, బోయలతో పాటుగా బందిపోటు వర్గాలుగా ఉండి.. గెరిల్లా మెరుపు దాడుల్లో సిద్ధహస్తులుగా ఉండేవారు.. వీరి సహకారంతోనే ఛత్రపతి శివాజీ, ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి, కన్నెగంటి హనుమంతు, రుద్రమ దేవి, ప్రతాప రుద్రుడు వంటివారు.. గెరిల్లా దాడుల ద్వారా.. యుద్దాలు గెలిచారు.. 


      వీరు గ్రామ తిరునాళ్ళు పండుగలలో, పోతురాజు ఆచారాన్ని పాటించేవారు.. బలుల ద్వారా గ్రామ దేవతలకు సంతర్పణ ఇచ్చి, గ్రమ బొడ్డురాయి, పొలిమేర నిర్ణయించడం వీరి బాధ్యత..


🔹👉 మాలల శాఖల్లోనే మాలల స్వీకరించిన వృత్తుల చరిత్ర 👈🔹


        ఒక నిర్ధిష్ట కుల వృత్తి లేని మాలలు, ఒక్కో సమయంలో ఒక్కో వృత్తి స్వీకరించినట్టు, మాల శాఖల చరిత్ర చూస్తే తెలుస్తుంది.. ఏది ఏమైనప్పటికీ.. మాలలకు అన్నింటికంటే ఎక్కువగా కల్పించబడిన బాధ్యత.. గ్రామ రక్షణగా తెలుస్తుంది.. మాలల యుద్ధ విద్య నైపుణ్యం వల్లనే, మాలలకు గ్రామ రక్షకులుగా బాధ్యతలు అప్పగించినట్టు చెప్పవచ్చు.. 


      ఇప్పుడు స్వతంత్ర కులాలుగా కనిపిస్తున్న పైన చెప్పబడిన కులాలను, మనకు సంబంధం లేని కులాలు అనే అపోహ నుండి బయటపడి,, అవి మాల కులంలోని శాఖలు అని ఈ జనరేషన్ తెలుసుకుని,, ఈ కులాలను తమ బంధువులుగా తిరిగి స్వీకరించి,, జాతి ఐక్యతకు తోడ్పడాల్సిన అవసరం ఉంది.. 


 👉👉 మాల బంధువులు అందరూ ఐక్యం అయితే మాల జాతికి పూర్వవైభవం రావడం ఖాయం.. 


👉👉👉👉 మాలల ఈ స్థాయి వెనకబాటుకి ముఖ్య కారణం,, మాలలు తమ మూలాలను మర్చిపోవడమే.. ఆ మూలాలను మళ్లీ బయటకు తీసుకొచ్చే ప్రయత్నమే.. ఈ శీర్షిక...

Tuesday, May 16, 2023

ఎస్సీ వర్గీకరణ ఎందుకు?

 🔷🔹👉 వర్గీకరణ - మొత్తం కథ 👈🔹🔷


(పూర్తిగా చదవండి - ముఖ్యంగా ప్రస్తుత తరానికి కనీసం నలుగురి చేత చదివించండి)


🔹 ముందుమాట - ముందుగా ఈ వ్యాసం ఎందుకు రాయాల్సి వచ్చిందో చెబుతాను.. 


👉 మొదటిది - వర్గీకరణ వాదులు ఈ మధ్య చాలా అందమైన అబద్దాలు ప్రచారాలు చేస్తున్నారు.. వాటిని ఖండించాల్సి ఉంది కాబట్టి.. ఆవేమిటి అంటే..


▪️    వర్గీకరణకు సుప్రీమ్ కోర్టు ఒప్పుకుంది కానీ, పార్లమెంటు ద్వారా చట్టం చేయమంది అని..

▪️    బాబాసాహెబ్ వర్గీకరణకు అనుకూలంగా రాజ్యాంగంలో అన్నీ ఏర్పాట్లు చేశారు అని..

▪️    వర్గీకరణ ఉపకులాల కోసమే.. వర్గీకరణ జరిగినప్పుడు మాల- మాదిగ కానీ ఉపకులాలు బాగా లాభం పొందాయి అని..

▪️    వర్గీకరణకు జాతీయ SC/ST కమీషన్ కూడా సిఫార్సు చేసిందని..

▪️    ప్రభుత్వాలు వర్గీకరణ కోసం ఏర్పాటు చేసిన, జస్టిస్ రామచంద్రరాజు, ఉషామెహ్రా కమీషన్లు మాలలే దోచుకున్నారు అని రిపోర్టులు ఇచ్చాయని.. 


👉 రెండోది -  వర్గీకరణకు సంబందించిన అంశాలు 25 సంవత్సరాలు పాతవి కావడంతో, చాలా మందికి అప్పుడు జరిగిన సంఘటనలు మీద అవగాహన లేకపోవడం.. అవి తెలియజేయకపోతే, వర్గీకరణవాదులు చెబుతున్న అబద్దాలనే నిజాలు అని నమ్మే ప్రమాదం ఉంది కాబట్టి.. 


🔷 రిజర్వేషన్లలో రిజర్వేషన్లు - దాని మొదలు ఎక్కడ 🔷


     ఈ డిమాండ్ మొట్టమొదట పుట్టింది పంజాబ్ రాష్ట్రంలో... 1975 చమార్లు మరియు, చామర్ల నుండి సిక్కుమతం స్వీకరించిన, రాందాసియా/రవిదాసియా సిక్కులే రాజకీయాల్లో ప్రాబల్యం చూపిస్తున్నారు అనే కారణంతో వాల్మీకి/భంగి కులస్తులు మరియు ఆ కులాల్లో నుండి సిక్కుమతంలోకి మారిన మజహాబీ సిక్కుల డిమాండ్ మేరకు.. మే 5, 1975 న, గ్యాని జైల్ సింగ్ ప్రభుత్వం, 50% ప్రభుత్వ ఉద్యోగాల్లో,, వాల్మీకి/భంగి/మజహాబీ సిక్కులకు  మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి అనే ఆర్డినెన్స్ జారీ చేసింది.. అగ్రకుల సిక్కులకు వ్యతిరేకంగా చమార్ సిక్కుల రాజకీయ ప్రాబల్యం పెరుగుతుండడం దీనికి ముఖ్య కారణం.. ఇదే విధానాన్ని హర్యానా ప్రభుత్వం కూడా కొనసాగిస్తూ 1994 సంవత్సరంలో.. SC కులాలను రెండు బ్లాకులుగా విభజించి.. Block -A లో చమార్లు కానీ కులాలకు (Non- Chamar Castes) కు 50 % మరియు Block - B లో చమార్లకు 50% రిజర్వేషన్లు ఇస్తూ,, అందులో ముందు Block-A కు మొదటి ప్రిఫరెన్స్ ఇవ్వాలి అని మెలిక పెట్టింది.. 


      ఇదే అంశం మీద ఉత్తర్ ప్రదేశ్, బీహార్ ప్రాంతాల్లో కూడా చమార్ల రాజకీయ ప్రాబల్యం మీద ఉక్కుపాదం మోపడానికి డిమాండ్లు వచ్చినా,, ప్రభుత్వాలు ధైర్యం చేయలేదు.. ఈ అన్యాయాన్ని ఉత్తర భారత దేశ చమార్లు తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చారు.. 


       రాందాసియా సిక్కు అయిన కాన్షిరాం, ఉత్తర్ ప్రదేశ్ చమార్ అయిన మాయావతి,, రిజర్వేషన్లలో రిజర్వేషన్లు అనే వాదాన్ని,, బలంగా వ్యతిరేకించడానికి కారణం ఏమిటో మీకు అర్ధం అయ్యి ఉండచ్చు.. దానితో పాటు.. ఈ రిజర్వేషన్లలో రిజర్వేషన్లు లేదా వర్గీకరణ అనే ఆయుధాన్ని ప్రభుత్వాలు ఎందుకు వాడుకుంటాయో, కూడా అర్ధం అయ్యి ఉండాలి..


🔷 ఆంధ్రప్రదేశ్ వర్గీకరణ ఉద్యమం పుట్టుక 🔷


     వర్గీకరణ ఉద్యమం పుట్టుకకు ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ అవతరణతో బీజాలు పడ్డాయి అని చెప్పవచ్చు.. 17 జులై 1985 కారంచేడు మాదిగల ఊచకోత,, ఆ ఘటనకు వ్యతిరేకంగా 1985 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ దళిత మహా సభ స్థాపించి,, కత్తి పద్మారావు గారు, బొజ్జా తారకం గారి నాయకత్వంలో కొనసాగిన మహా ఉద్యమం సృష్టించిన ఒరవడి,, దేశ రాజకీయాలను ప్రభావితం చేసి SC/ST అట్రాసిటీ చట్టం సాధించేలా చేయగలిసింది.. 


      జూన్ 4, 1991 న చుండూరు మాలలు మీద జరిగిన అమానుష దాడి,, దాని మీద మళ్ళీ దళిత మహాసభ పోరాటం,, ఒక్క పిలుపు ఇస్తే లక్షల మంది పొగవడం,, సుప్రీమ్ కోర్టుని, ఘటన జరిగిన ప్రాంతానికి లాక్కొచ్చి తీర్పు ఇప్పించిన విధానం అగ్రకులాల రాజకీయ పార్టీలలో ప్రకంపనలు సృష్టించింది.. 


      ఈ ఉద్యమాల ద్వారా తెలుగు రాష్ట్రాల దళితులు, తమ సామాజిక ఉద్యమాలతో, పార్లమెంటు, సుప్రీమ్ కోర్టులను కూడా ప్రభావితం చేసే శక్తి కలిగి ఉన్నారు అనే విషయాన్ని,, రాజకీయ పార్టీలు జీర్ణించుకోలేకపోయాయి.. 


     ఇప్పటి దాకా, అగ్రకుల రాజకీయ పార్టీలకు ఓటర్లుగా మాత్రమే ఉన్న దళితుల, సామాజిక ఉద్యమం, రాజకీయ ఉద్యమంగా పరిణామం చెందే అవకాశాలు ఉన్నాయి అని భయపడసాగారు.., ఈ భయం 1993 ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో కింగ్ మేకర్ గా ఎదిగిన బహుజన్ సమాజ్ పార్టీ వలన మరింత బలపడసాగింది.. బహుజన సమాజ్ పార్టీ నాయకత్వం, దళిత మహాసభ నాయకత్వం మధ్య సంప్రదింపులు జరుగుతుండడం లాంటివి, అగ్రకుల పార్టీలకు రాబోయేవి గడ్డు రోజులేననే సంకేతాన్ని పంపాయి.. 


      అగ్రకుల నాయకత్వ రాజకీయ గురువులు, పార్టీలకు అతీతంగా, రాబోయే గడ్డు రోజులను ఎదుర్కోవడానికి పన్నగాలు చేయసాగారు.. ఆ సమయంలో వాళ్లకు కనిపించిన మార్గం,,  పీడిత కులాల శక్తిని నిర్వీర్యం చేయడానికి తరతరాలుగా ఉపయోగిస్తున్న ఆయుధం దళితులను కులాల లెక్కన విడగొట్టడం.. ఉద్యమాలు అన్నీ మాలల నాయకత్వంలో నడుస్తున్నాయి.. ఉద్యమ ఫలాలు అన్నీ మాలలే దోచుకుంటున్నారు అంటూ.. తమ పార్టీలలో దళిత పాలేర్లతో ప్రచారం మొదలుపెట్టారు..


      తెలుగు దేశం పార్టీ ఒక అడుగు ముందుకు వేసి,, చంద్రబాబు నాయుడు అనుచరుడైన దండు వీరయ్య మాదిగ నాయకత్వంలో 1994లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (MRPS)అనే సంఘం పెట్టించి,, మాలలు మీద విష ప్రచారం మొదలుపెట్టింది.. తరువాత చుండూరు ప్రభావంతో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి 1994 ఎలెక్షన్లలో తెలుగుదేశం ప్రభుత్వం రావడం,, 1995లో చంద్రబాబు, ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి, ముఖ్యమంత్రి అవ్వడం జరిగాయి.. 


    చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక వర్గీకరణ ఉద్యమం ఊపందుకుంది.. అప్పటి దాకా స్తబ్దంగా ఉన్న MRPS కి, అప్పటి దాకా అనామకుడిగా ఉన్న మందా కృష్ణ నాయకుడిగా రావడం ,, రాత్రికి రాత్రి, మందా కృష్ణ నాయకత్వాన్ని ఎలివేట్ చేస్తూ గ్రామ గ్రామాన పోస్టర్లు కనిపించడం, వెనుక తెలుగుదేశం మరియు చంద్రబాబు ఉన్నాడు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. మాదిగల ఆత్మగౌరవ యాత్ర పేరుతో, దండోరా పేరుతో మందా కృష్ణ మాదిగ పల్లెల్లో మాలల మీద విషం కక్కుతూ ప్రచారం చేయడం మొదలుపెట్టాడు..


🔷 వర్గీకరణ ఆర్డినెన్సు - దాని రూపురేఖలు - చరిత్ర 🔷


🔹జస్టిస్ రామచంద్ర రాజు కమీషన్ ఏర్పాటు 🔹    


       మందా కృష్ణ విష ప్రచారాన్ని సాకుగా చూపించి.. తెలుగుదేశం ప్రభుత్వం ఆఘమేఘాల మీద, 1996 సెప్టెంబర్ నెలలో, రిటైర్డ్ జడ్జీ రామచంద్ర రాజు తో సింగిల్ మెంబెర్ ( ఏక-సభ్య) కమీషన్ వేసింది.. విషయం మీద తమ వాదనలు, representation ఇవ్వడానికి కమిటీ తెలుగు మరియు ఇంగ్లీష్ వార్తా పత్రికలలో ప్రకటనలు ఇచ్చింది.. 


     ఒక సంఘంగా ఏర్పడి లేకపోవడం వల్ల, ఈ మొత్తం తంతు మీద ఏమి జరుగుతుందో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్న మాలలు తమ వాదన కమిటీ ముందు వినిపించలేకపోయారు.. అప్పటికే పూర్తి సిద్ధంగా ఉన్న MRPS మరియు మాదిగ ఉద్యోగ సంఘాలు తమ తప్పుడు లెక్కలతో కమిటీ ని పక్కదారి పట్టించారు.. తర్వాత PV రావు లాంటి నాయకులు, మాల ఉద్యోగస్తులతో ఒక సంఘంగా ఏర్పడి.. తమ వాదన వినిపించే ప్రయత్నం చేసినప్పటికీ, రామచంద్ర రాజు కమిటీ 15 మే 1997 కు ముందు వచ్చిన వాదనలు మాత్రమే పరిగణించి, 16 మే నుండి వచ్చిన వాదనలు పరిగణలోకి తీసుకోబోవని ప్రకటించి,, మాలల ప్రాతినిధ్యం వాదనను ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టి 28 మే 1997 న అర్ధాంతరంగా అసమగ్ర రిపోర్టు సమర్పించింది..


👉     రిపోర్టు లోని ముఖ్య అంశాలు.. వర్గీకరణ Structure


 -    1979 జనాభా ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుర్తించబడిన 59 SC కులాల్లో, మాల మరియు అది-ఆంధ్ర కులాలు రిజర్వేషన్ల ద్వారా తమ జనాభాకు మించి లబ్ది పొందారు.. 


- అందులో అత్యంత తక్కువ లబ్ది పొందిన కులం రెల్లి.. అత్యంత ఎక్కువ లబ్ది పొందిన కుల ఆది ఆంధ్రా.. కాబట్టి పొందిన లబ్ది ఆధారంగా వీరిని 4 కేటగిరీలుగా విభజించడం అయింది..


-  అత్యంత తక్కువ లబ్ది పొందింది కాబట్టి రెల్లి వారిని SC-A గాను,, తరువాతి అత్యల్ప లబ్ధిదారులు అయిన మాదిగలను SC-B గాను, తరువాత లబ్ధిదారులు అయిన మాల కులం వారిని SC-C గాను, అత్యధిక లబ్ధిదారులు అయిన అది-ఆంధ్రా వారిని SC-D గాను నిర్ణయించి.. వాళ్లకు జనాభా ఆధారంగా రిజర్వేషన్లలో శాతాన్ని, కింది విధంగా కేటాయించడం జరిగింది.. మిగతా SC కులాలను SC-A లో కలపాలని సిపార్సు చేసింది..


-     SC-A  (రెల్లి)           ------ 1%

-     SC-B   (మాదిగ)     ------ 7%

-     SC-C   (మాల)       ------ 6%

-     SC-D  (అది ఆంధ్ర) ------ 1%


-   దానితో పాటు మాదిగలకు లబ్ది చెకుర్చే ఇంకో మెలిక పెట్టింది.. అదేమిటంటే.. ఒకవేళ ఏదైనా కేటగిరీలో సీటుకు అభ్యర్థులే లేకపోతే,, ఆ సీట్లు తరువాతి కేటగిరీ వారికి ఇవ్వాలి అని,, 


-   అనగా.. అభివృద్ధి చెందిన మాదిగ, మాల, అది ఆంధ్ర కులాలు కాకుండా.. మిగతా 56 కులాల్లో, అభ్యర్థులే లేకపోతే ఆ సీటు మాదిగలకు చెందేటట్టు, మాదిగలకు ప్రత్యేక హక్కు కల్పించింది. అంటే రెల్లి, మరియు ఇతర 56 SC కులాల సీట్లు కూడా మాదిగలకే చెందేలా ఇచ్చిన వెసులుబాటు...


((-     కనీసం ప్రాథమిక విద్య కూడా అందుకునే పరిస్థితి లేకపోవడంతో,, SC-A కేటగిరీ లో కనీసం అవకాశాలకు తగ్గట్టు అభ్యర్థులు లేకపోవడం, అవి ఆటోమాటిక్ గా మాదిగలకు రావడం వల్ల మాదిగలు, తమ జనాభా కంటే ఎక్కువ లబ్ది పొందే అవకాశం, ఉండడంతో,, మాదిగలు మిగతా 56 SC కులాల సామాజిక స్థాయి మెరుగుపరిచే ఏ చర్యకు అయినా వ్యతిరేకించడం మాములే.. ))


-   ముందే నిర్ణయించి పెట్టిన ప్రక్రియ కాబట్టి,, కమీషన్ సిపార్సులను ఆమోదించడానికి, కాబినెట్ సబ్ కమిటీ వేయడం, కాబినెట్ సబ్ కమిటీ సిపార్సులను ఆమోదించడం వెంటవెంటనే జరిగిపోయాయి, వారం రోజుల్లో ఆఘమేఘాల మీద 6 జూన్ 1997 న ప్రభుత్వం జస్టిస్ రామచంద్ర రాజు సిపార్సుల మేరకు, వర్గీకరణను 1997-98 విద్యా సంవత్సరం నుండే అమలుచేస్తూ G.O విడుదల చేసింది.. తద్వారా గవర్నర్ ఆమోదంతో ఆర్డినెన్సు పాస్ చేసింది..


🔷 వర్గీకరణ చట్టం - మాలల న్యాయ పోరాటం 🔷

 

     1997 సంవత్సరంలో మాల ఉద్యోగస్తులు మాల మహనడుగా ఏర్పాటు అయ్యి, వర్గీకరణ మీద న్యాయపోరాటానికి దిగారు.. తమ ప్రతినిధ్యాన్నీ కనీసం పరిగణించకుండా, ఒకే వైపు వాదనల మీద ఆధారపడి వర్గీకరించడం హేతుబద్దం కాదు అని.. మాల ఉద్యోగ సంఘాలు 1997 డిసెంబర్ లో ఆంధ్రప్రదేశ్ హై కోర్టులో పిటీషన్ దాఖలు చేశాయి.. పిటీషన్ మీద విచారణ చేసిన హై కోర్టు.. జాతీయ SC/ST కమీషన్ ను సంప్రదించకుండా, SC రిజర్వేషన్లలో మార్పులు చేయడం చెల్లదని, తెలుగుదేశం ప్రభుత్వానికి చివాట్లు పెట్టింది..


     హై కోర్టు మొట్టికాయల వల్ల తెలుగుదేశం ప్రభుత్వం 1998 ఫిబ్రవరీ లో, జాతీయ SC/ST కమీషన్ కు, వర్గీకరణ ఆర్డినెన్సును ఆమోదానికి పంపింది.. 


🔹 జాతీయ SC/ST కమీషన్ ప్రాథమిక నివేదిక 🔹


       జస్టిస్ రామచంద్ర రాజు కమీషన్ చేసిన విచారణలు పరిశీలించిన SC/ST కమీషన్,, ఆ విచారణ చాలా పరిమితమైన అసమగ్రమైన డేటా ఆధారంగా,, తక్కువ సమయంలో, అత్యల్ప సమాచారాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుని చేసిన తొందరపాటు ఏకపక్ష విచారణ అని,, సంపూర్ణ అధ్యయనానికి కావలసిన శాస్త్రీయ విధానాలు ఏవీ అవలంభించలేదు కాబట్టి,, రామచంద్ర రాజు కమీషన్ సిఫార్సులు హేతుబద్ధమైనవి కాదు అని,, ఈ ఆర్డినెన్సును ఆమోదించడం కుదరదు అని తిప్పి పంపింది..


- జాతీయ SC/ST కమీషన్ నుండి చుక్కెదురు కావడంతో, దొడ్డిదారిన ప్రెసిడెంటు ఆమోదం ద్వారా ఆర్డినెన్సును అమల్లోకి తెచ్చుకునేందుకు పంపి, 1999 నవంబర్ లో ప్రెసిడెంటు ఆమోదం పొందింది.. వెనువెంటనే.. ఇంకా ఆర్డినెన్సు మీద కోర్టులో విచారణ నడుస్తూ ఉండగానే.. మే 02, 2000 న, వర్గీకరణ ఆర్డినెన్సుకు చట్టం రూపం ఇస్తూ,, ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ కులాలు (రిజర్వేషన్ల వర్గీకరణ) చట్టం - 2000, ను దొడ్డిదారిలో అమల్లోకి తెచ్చింది..


- మాల మహానాడు ఆధ్వర్యంలో,, వర్గీకరణ చట్టం మీద జూన్ 2000 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ హై కోర్టులో వేసిన పిటిషన్లను అన్నింటినీ.. ఐదుగురు సభ్యుల ధర్మాసనం నవంబర్ 2000 న కొట్టివేసింది.. కొట్టి వేస్తూ.. తమ తీర్పు మీద సుప్రీమ్ కోర్టుకు వెళ్ళడానికి వీలు కల్పిస్తూ స్పెషల్ లీవ్ అనుమతి ఇచ్చింది..


🔷 సుప్రీమ్ కోర్టు తీర్పు - సుప్రీమ్ కోర్టు చేసిన పరిశీలనలు 🔷


       సుప్రీమ్ కోర్టులో మాలలు దాఖలు చేసిన, వందల పిటీషన్ లను "ఈ. వి చెన్నయ్య vs ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు ఇతరులు" పేరుతో ఒకే పిటీషన్ గా పరిగణిస్తూ సుప్రీమ్ కోర్టు విచారణ మొదలుపెట్టింది.. నాలుగు సంవత్సరాల న్యాయపోరాటం తర్వాత సుప్రీమ్ కోర్టు  నవంబర్ 05, 2004 న, ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవ నిర్ణయం ద్వారా.. వర్గీకరణ చట్టం రాజ్యాంగ విరుద్ధంగా చేయబడిన చట్టం అని,, దాని చెల్లుబాటుని నిలిపివేస్తూ తీర్పు చెప్పింది.. 


👉 తీర్పులోని ముఖ్య అంశాలు


➖  ఈ చట్టాన్ని కొట్టేయడానికి 3 కారణాలు..


1. రిజర్వేషన్ల షెడ్యూల్డ్ లిస్టు నుండి కులాలను తీసివేయడం లేదా కొత్త కులాలను చేర్చడం లాంటి మార్పు చేర్పులు చేసే అధికారం,,  భారత రాజ్యాంగం ఆర్టికల్ 341(2) ద్వారా కేవలం పార్లమెంటుకు మాత్రమే ఇవ్వబడింది..

2. చట్ట ప్రక్రీయ ద్వారా జరగకపోవడం వలన ఈ చట్టానికి చట్టబద్ధత లేకపోవడం

3. రిజర్వేషన్లలో మళ్ళీ రిజర్వేషన్లు ఏర్పాటు చేయదాని మీద  భారత రాజ్యాంగం ఆర్టికల్ 14, బలమైన ఆంక్షలు విధించబడి ఉండడం..


➖ పై కారణాలు చూపుతూనే.. మరిన్ని పరిశీలనలు చేశారు... ఆవేమిటంటే


▪️ ఒక కులానికి న్యాయం చేయడం అనే సాకుతో,, ఇంకో కులానికి రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన హక్కులను కాలరాయాలని చూడడం కూడా వివక్ష చూపడమే అవుతుంది.. 


▪️ ఒకే స్థాయివిగా నిర్ణయించబడి కల్పించబడిన ఉమ్మడి రిజర్వేషన్లను మళ్లీ వర్గీకరించడం వలన, సమాన కులాల మధ్య సమాన పోటీ నిరోధించబడి.. SC కులాలకు తప్పుడు సంకేతాలు పంపి, సభ్యుని వ్యక్తిగత వికాసానికి పరిమితులు విధించే ప్రమాదం ఉంది.


▪️ అసమానతలను రూపు మాపే లక్ష్యంతో కల్పించబడిన రిజర్వేషన్లను మళ్ళి వర్గీకరించడం ద్వారా,, కృత్రిమ అసమానతలు సృష్టించబడి,, రిజర్వేషన్ల లక్ష్యమే పూర్తి దెబ్బ తినే ప్రమాదం ఉంది.. అది భారత సామాజిక నిర్మాణాన్ని మరిన్ని ముక్కలు చేయగలదు.. 


▪️కాబట్టి రాష్ట్రాలు తమ రాజకీయ లబ్ది కోసం విభజనల్లో మళ్లీ విభజనల్లో తీసుకువస్తూ, కులాధారిత ప్రతిభ అనే ఆశాస్త్రీయ ఊహ మీద ఆధారపడి, వ్యక్తిగత ప్రతిభను నిరుత్సాహపరిచే, వ్యక్తిగత వికాసాన్ని నిరోధించే చట్టాలు చేయడానికి పూనుకోవడం సమర్ధనీయం కాదు..


🔷 పార్లమెంటులో వర్గీకరణ చట్టం - ఉషా మెహ్రా కమీషన్ 🔷


       సుప్రీమ్ కోర్టులో చుక్కెదురు కావడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం,, అంశాన్ని పార్లమెంటు ముందు ఉంచింది... ఈ సారి వంతు రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వానిది,,  వర్గీకరణకు అనుకూలంగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఏకగ్రీవ తీర్మానం ఆమోదించి పార్లమెంటుకు పంపింది..  


- అంశాన్ని పరిశీలించిన కేంద్ర సాంఘిక సంక్షేమ మంత్రిత్వ శాఖ మార్చి 28, 2005 న, అంశాన్ని న్యాయ మంత్రిత్వ శాఖ పరిశీలనకు పంపింది..


- సుప్రీమ్ కోర్టు తీర్పు నేపథ్యంలో, న్యాయ మంత్రిత్వ శాఖ, ప్రభుత్వ అటార్నీ జనరల్ అభిప్రాయం కోసం పంపింది..


- భారత అటార్నీ జనరల్ (AGI).. ఇలాంటి చట్టం యొక్క అవసరం ఏమీ కనిపించడం లేదు అని, అలాంటి అవసరం ఏమైనా ఉందా అనే పరిశీలన జరిపిన తర్వాత మాత్రమే దీన్ని పరిగణించాలి అంటూనే.. ఒకవేళ ప్రభుత్వం ఇలాంటి చట్టం చేయడలుచుకుంటే,, అది రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే సాధ్యం అని అభిప్రాయం వ్యక్తం చేసింది..


- అటార్నీ జనరల్ చేసిన సిఫారసులను పరిగణలోకి తీసుకుని, అలాంటి అవసరం ఏమైనా ఉన్నదా అనే అధ్యయనం కోసం పార్లమెంటు Cabinet committee of Political and Political Affairs అనుమతి ద్వారా.. రిటైర్డ్ జడ్జీ జస్టిస్ ఉషా మెహ్రా ఆధ్వర్యంలో,,  National Commission for Sub-categorization of Scheduled Castes of Andhrapradesh (NCSCSC) పేరుతో కమీషన్ ఏర్పాటు చేయడం జరిగింది..


- ఉషా మెహ్రా కమీషన్ మళ్లీ అదే హేతుబద్ధత లేని జస్టీస్ రామచంద్రరాజు రిపోర్టులోనే మార్పులు చేసి, సమగ్రమైన విచారణ మీద దృష్టి పెట్టకుండా,, వర్గీకరణకు అడ్డు వస్తున్న రాజ్యాంగంలో, సవరణలు ఎలా చేయాలి అనేదాని మీద ఎక్కువ దృష్టి పెట్టి,, చివరికి మే 2008 తన రిపోర్టు ప్రభుత్వానికి సమర్పిస్తూ,, ఆర్టికల్ 341 లో మార్పులు చేయాలని సూచించింది.., రాష్ట్రాల తీర్మానాల ఆధారంగా వర్గీకరణ చేసే అధికారం పార్లమెంటుకు కల్పిస్తూ.. ఆర్టికల్ 341 లో, 341 (3) అనే కొత్త క్లాసుని చేర్చేందుకు రాజ్యాంగ సవరణ చేయాలని సూచించింది..


🔷  జాతీయ SC/ST కమీషన్ చేతిలో వర్గీకరణ చివరి ఘట్టం 🔷


      రాజ్యాంగం ఆర్టికల్ 338 (9) ద్వారా జాతీయ SC/ST కమీషన్ కు ఇచ్చిన అధికారం వలన, మరియు సుప్రీమ్ కోర్టు తీర్పు నేపథ్యంలో కొత్త క్లాసుని చేర్చే విషయం మీద అనుమతి కోసం ఉషా మెహ్రా కమిషన్ సిఫార్సులు SC/ST కమీషన్ కు పంపబడ్డాయి.. 


      సమగ్ర పరిశీలన చేసిన SC/ST కమీషన్.. ఈ క్రింది పరిశీలన చేసింది..


- రాష్ట్ర ప్రభుత్వానికి సంబందించిన ఉద్యోగాలు, సీట్ల విషయంలో మాత్రమే రాష్ట్ర అసెంబ్లీకి తీర్మానం చేసే హక్కు ఉంటుంది..


- SC, ST లు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు/సీట్లకు, మరియు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు/సీట్లకు సమాన అర్హత కలిగి ఉంటారు..


- కాబట్టి ఒక కులం రాష్ట్రంలో, మరియు కేంద్రంలో విభిన్న శాతానికి అర్హత నిర్ణయించడం అనేది, మరిన్ని కొత్త సమస్యలకు, తికమకలకు కారణం అవుతుంది..


-  కాబట్టి రాష్ట్రాలు ఎవరికైనా ప్రత్యేక రిజర్వేషన్లు ఇవ్వదలిస్తే రాజ్యాంగ ఆర్టికల్ 16(4) ద్వారా కల్పించే వీలు ఉంది కాబట్టి,, ఆర్టికల్ 341లో సవరణ చేయడానికి అనుమతి ఇవ్వలేము అని చెప్పి తిప్పి పంపింది.. 


          మళ్లీ కాబినెట్ కమిటీ ఈసారి ఆర్టికల్ 341 కి (3) మాత్రమే కాకుండా దానితో పాటు (4) వ క్లాజు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు మరియు రాష్ట్ర ప్రభుత్వం చేత నడపబడితున్న సంస్థల్లో వర్గీకరణ చేసే ప్రత్యేక అధికారం రాష్ట్రాలకు ఇవ్వడాన్ని కూడా ఆర్టికల్ 16(4) కి జత చేస్తూ ఇంకో సవరణకు ప్రతిపాదించి.. మళ్ళీ SC/ST కమీషన్ అనుమతి కోసం పంపింది..


🔷 జాతీయ SC/ST కమీషన్ ప్రతిష్టాత్మక పరిశీలనలు 🔷


     ఈసారి ప్రభుత్వ మొండిపట్టును సీరియస్ గా తీసుకున్న జాతీయ SC/ST కమీషన్, ఆ సిఫారసులలోని లోపాల మీద ప్రతిష్టాత్మక పరిశీలనలు చేసింది.. అందులో ముఖ్యమైనవి


- రకరకాల కారణాల వల్ల SC లలో కొన్ని కులాలు, తమ జనాభా కంటే ఎక్కువ అవకాశాలు రిజర్వేషన్ల ద్వారా పొంది ఉండవచ్చు... అలాగే ఎన్నో కులాలకు రిజర్వేషన్ల ఫలాలు అందుబాటులోకి కూడా రాలేదు..


-  రిజర్వేషన్లు అందుకోలేని కులాల జనాభా చాలా తక్కువగా ఉంటుంది.. వారి జనాభా ప్రకారం వారికి రిజర్వేషన్లలో భాగాన్ని నిర్దేశిస్తే, వారు ఒక్కో అవకాశం/సీటు కోసం దశాబ్దాలు, కొన్నిసార్లు శతాబ్దాల వేచి ఉండాల్సిన ప్రమాదం ఉంది..


-  ఉదాహరణకు రామచంద్ర రాజు కమీషన్ సిపారసుని తీసుకుంటే SC-A  మరియు SC-D లకు చెరొక 1% రిజర్వేషన్లకు పరిమితం చేయబడ్డాయి.. చాలా ప్రభుత్వ సర్వీసులలో ఖాళీలు అత్యల్పంగా ఉంటున్నాయి.. ఆ తక్కువ ఖాళీలతో మళ్లీ 1% అంటే అది ఎప్పుడు వస్తుందో కూడా ఎవరూ చెప్పలేరు.. 


- ఒక వేళ వచ్చినా ఆ సమయానికి దరఖాస్తుదారుల్లో ఆ కులాల అభ్యర్థులు ఎవరు లేకపోతే,, మళ్ళీ వారి అవకాశాలు అప్పటికే అభివృద్ధి చెందిన కులాలకు వెళ్లిపోతాయి.. పరోక్షంగా మళ్ళీ అభివృద్ధి చెందిన కులాలకే ఎక్కువ లాభం తీసుకువచ్చే అవకాశం ఉంది..


- అందులోనూ, అత్యధికంగా ఖాళీలు కేవలం కింది స్థాయి ఉద్యోగాల్లో మాత్రమే ఉంటాయి కాబట్టి, కిందినస్థాయి ఉద్యోగాల్లో బొటాబొటీ అవకాశాలు పొందినప్పటికీ,, పై స్థాయి ఉద్యోగాల్లో తక్కువ ఉద్యోగాలకు ఎక్కువ పోటీ ఉండడం వలన వారి దాకా అవకాశాలు వచ్చే పరిస్థితి లేకుండా పోయే, దయనీయ స్థాయికి వాళ్ళు నెట్టబడతారు...


- ఈ మొత్తం తతంగం వలన, అభివృద్ధి ఫలాలకు దూరంగా ఉన్న కులాలను అభివృద్ధిలోకి తేవడానికి,, అభివృద్ధి చెందిన కులాలు సహకరించకుండా పోయే ప్రమాదం ఉంది.. 


- కాబట్టి, రిజర్వేషన్లను వర్గీకరించడం అనే ప్రక్రియ, అభివృద్ధి ఫలాలకు దూరంగా ఉన్న కులాలను అభివృద్ధిలోకి తీసుకువస్తుంది అనే వాదన సత్యదూరం..


-  దానిబదులు,, ప్రత్యేక రాయితీలు మరియు పథకాల ద్వారా విద్య, ఆరోగ్యం లాంటి మౌలిక వసతులు, వారి గడప వద్దకు తీసుకువెళ్లి లబ్ది కల్పించి, వారిని అభివృద్ధి ఫలాలు అందుకోవడానికి సిద్ధం చేయడం, అనేది చాలా మంచి ఫలితాలను ఇస్తుంది.. 


- మరో ముఖ్యమైన అంశం చారిత్రకంగా డెనోటిఫీడ్- తెగలుగా, సంచార కులాలుగా, ఉప సంచార కులాలుగా, మాజీ క్రిమినల్ తెగలు గా ఉన్న చాలా కులాలను  SC/ST ల జాబితాలో చేర్చడం జరిగింది.. వీరి సామాజిక వ్యవహారాలు, సాంప్రదాయిక వృత్తులు విభిన్నం కావడం చేత వీరిని వర్గీకరణ పేరుతో మిగతా కులాలతో కలపడం చాలా కష్టమైన పని..


- అంతే కాకుండా వీరి సంచార జీవన విధానం వలన,, వీరి జనాభా మీద ఏ రాష్ట్ర ప్రభుత్వం దగ్గరా కూడా సరైన లెక్కలు అందుబాటులో లేవు.. వివిధ రాష్ట్రాల్లో వీరు వివిధ కులాలుగా SC, ST, OBC లుగా గుర్తింపబడతారు,, మరియు వీరికి ప్రభుత్వ పథకాలు ఈ స్థాయిలో అందుతున్నాయి, అని రాష్ట్రాల ప్రకారం వేరువేరుగా లెక్కలు వేయడం సాధ్యమైన పని కానేకాదు..


-  మొత్తానికి సమగ్ర పరిశీలన తర్వాత అర్ధం అవుతుంది ఏమిటంటే,, వర్గీకరణ వల్ల వెనకబడిపోయిన దళిత కులాల అభివృద్ధి సాధ్యం అవడం అసంభవం.. కేవలం విద్య, వైద్యం లాంటి మౌలిక సదుపాయాలు వారికి మరింత అందుబాటులోకి తెచ్చి,, వారిని ఆర్థిక కార్యకలాపాల్లో భాగం చేస్తూ,, వారిని రిజర్వేషన్లు వాడుకోవడానికి సంసిద్ధం చేస్తూ వెళ్లాడమే అంతిమ పరిష్కారం..


- కావున రాష్ట్రాలు తమ SC జనాభాను,, 3 కేటగిరీలుగా.. 1.అభివృద్ధి చెందిన కులాలు, 2 అభివృద్ధి చెందుతున్న కులాలు 3. అభివృద్ధికి నోచుకోని కులాలుగా విభజించి.. వారికి ప్రత్యేక ప్రభుత్వ పథకాలు, రాయితీలు కల్పించి, వారిని ఆర్ధిక కార్యకలాపాలకు మరింత చేరువ చేసే ప్రయత్నం చేయాలి..

     

👉       పై పరిశీలనలు చేసిన SC/ST కమీషన్,, తమ డ్రాఫ్ట్- నివేదిక ఈ విధంగా పొందు పరిచింది..


▪️ రిజర్వేషన్లు వర్గీకరించడం వలన, అవకాశాలకు నోచుకోని కులాలకు అవకాశాలు దక్కుడం జరగదు.. జరగకపోగా, వాళ్లకు ఉన్న అవకాశాల మీద పరిమితులు విధించడం, వారి అభివృద్ధికి శరాఘాతం కాగలదు...


▪️ అవకాశాలకు నోచుకోని కులాలకు ఇప్పుడున్న ప్రభుత్వ పథకాలతో పాటు, మరిన్ని పథకాలు అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేయాలి..


▪️ ఒకవేళ ఏదైనా SC కులం, ఇక వారికి రిజర్వేషన్లు అవసరం లేదు అనేవిధంగా అభివృద్ధి చెందింది అనే అభిప్రాయానికి రాష్ట్ర ప్రభుత్వాలు వస్తే,, వారిని SC జాబితా నుండి తొలగించేందుకు ప్రతిపాదనలు పంపవచ్చు,, అది రాజ్యాంగబద్ధంగా ప్రక్రియ కాబట్టి, ఇబ్బందులు ఉండవు..


🔷 వర్గీకరణ డిమాండు - చచ్చిన శవం 🔷


-       రాజ్యాంగ పరిరక్షణ సంస్థగా.. వర్గీకరణ చేయడం మీద పూర్తి అధికారాలు కలిగి ఉన్న జాతీయ SC/ST కమీషన్ వర్గీకరణ చేయడం వీలు కాదు, అది ఒక అసంబద్ధమైన డిమాండు అని తేల్చి చెప్పింది,, సుప్రీమ్ కోర్టు కూడా వర్గీకరణ చేయడం SC రిజర్వేషన్ల మీద తప్పుడు సంకేతాలు పంపే ప్రమాదం ఉందని అభిప్రాయపడింది.. అయినప్పటికీ, వర్గీకరణ పేరుతో మాదిగ నాయకత్వం, ధర్మ యుద్ధం, కురుక్షేత్రం, రణ భేరి లాంటి పేర్లతో సర్కస్ షోలు చేస్తూ మాదిగలను మభ్యపెడుతూ కాలం వెళ్ళిబూచుతున్నారు.. 


-       ఈ మొత్తం సర్కస్ షో కి కారణం, SC కులాల మధ్యలో చుచ్చుని కొనసాగిస్తూ, మాదిగలను అగ్రకుల పార్టీల ఓటుబ్యాంకుగా కొనసాగిస్తూ ఉండేందుకు చేస్తున్న కుట్ర అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు..


-        వర్గీకరణ జరిగితెగే 56 SC కులాలకు నష్టం జరుగుతుంది అని ప్రతీ రాజ్యాంగ సంస్ధ నొక్కి చెప్పినా, వర్గీకరణ ఉపకులాల (సమకులాలు) కోసం అని , వారిని మభ్యపెట్టడం వెనుక, వారి అవకాశాలను కూడా దొడ్డిదారిన పొందే అవకాశం కోసం మసిపూసే మారెడుకాయ చేసే వేషాలు అని కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు...


-       దేశవ్యాప్తంగా ఉన్న SC లు ఈ వర్గీకరణ డిమాండ్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.. ముఖ్యంగా మాదిగల సమకులం అయిన చమార్లు,, ఈ డిమాండును విచ్చిన్నవాదంగా భావిస్తూ వ్యతిరేకిస్తున్నారు.. కాబట్టి వర్గీకరణ జరిగే ప్రసక్తే లేదు అని కొంచెం బుర్ర వాడితే అర్థం అవుతుంది...


-        సమగ్ర అభివృద్ధి చేసుకుని వివక్షను జాయిస్తానే ఉద్దేశంతో చేయబడిన రిజర్వేషన్లలో, ఇలాంటి రాజకీయ ప్రేరిత విచ్చిన్నకార డిమాండ్లు వస్తాయి అని ముందే పసిగట్టిన రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబెడ్కర్ గారు, వర్గీకరణ లాంటి డిమాండ్లకు ఆస్కారం లేకుండా కట్టుదిట్టమైన రీతిలో చట్టాలను కూర్పు చేసి పెట్టారు.. ఆయన ముందు చూపే ఈరోజు అన్ని ప్రభుత్వాలు ఏకం అయినా, వర్గీకరణ వంటి విచ్చిన్నం వాదం చావుదెబ్బ తినడానికి కారణం అయ్యిందని చెప్పవచ్చు..


👉 చచ్చిన పాము వంటి వర్గీకరణ వాదాన్ని ఇంకా నెత్తిన మోసే రాజకీయ వ్యభిచారులతో జాగ్రత్త.. 👈


👉 వర్గీకరణ వాదుల వందల అబద్దాలకు సమాధానంగా... వేల నిజాలతో సిద్ధాంగా ఉండండి..👈


🔹🔹సత్యమేవ జయతే... 🔹🔹

🔹🔹 బహుజన హితాయ .!! బహుజన సుఖాయ.!! 🔹🔹

🔷🔷  సమతా సైనిక దళ్ - ఆంధ్రప్రదేశ్ 🔷🔷🔷🔹 SC వర్గీకరణ లక్ష్యం - మాదిగల స్వార్ధ ప్రయోజనం మాత్రమే 🔹🔷


       వర్గీకరణ డిమాండ్ కేవలం మాదిగల సొంత ప్రయోజనాల కోసమే తప్ప, మాల-మాదిగేతర 59 SC కులాలకు ఏ మాత్రం న్యాయం చేసే అవకాశం లేదు.. 


ఉదాహరణకు - వర్గీకరణ అమల్లో ఉన్నప్పుడు.. SC-B కేటగిరీ చేర్చబడిన కులాల సంగతే చూద్దాం.. 


      SC-B కేటగిరీలో మొత్తం 18 కులాలను చేర్చి వారికి 7% రిజర్వేషన్లు కేటాయించడం జరిగింది.. ఆ 18 కులాలు ఏమిటంటే.. 


1. మాదిగ.                        2. అరుంధతీయ.    

3. బేడ/ బుడగ జంగం       4. బైండ్ల 

5. చంబార్                        6. డెక్కలి.               

7. చమార్ / మోచి.           8. ధోర్

9.  గోదారి                        10. జగ్గలి.               

11.జాంబవులు.               12. మాంగ్

13. మాతంగి                    14. చిందులు.          

15.మాదిగదాసు/మాస్టీన్  16. సమగర

17. మాంగ్ గరోడి.             18. కొలుపులవాండ్లు..


     ఇందులో మాదిగ కులం తప్ప మిగతా కులాలు అన్నీ బలహీనమైన కులాలు,, మిగతా 17 కులాల కంటే, మాదిగలు సామాజికంగా ఆర్ధికంగా, రాజకీయంగా ఎంతో ముందు ఉన్నారు...  కాబట్టి.. SC-B క్యాటగిరీకి కేటాయించిన సీట్లు/ఉద్యోగాలు అన్నీ కూడా,, కేవలం మాదిగలు మాత్రమే పొందుతారు..


     అంటే.. 17 కులాల అవకాశాలను, అప్పనంగా మాదిగలకు కట్టబెట్టినట్టే.... ఇక్కడ మరి మిగతా 17 కులాలకు సమాన వాటా దక్కే అవకాశం ఉందా.. ??


👉 మాదిగల ప్రయోజనం కోసం పెట్టబడిన మెలిక - వర్గీకరణ చట్టంలో మాదిగలకు ప్రత్యేక లబ్ది చేకూర్చడానికి ఇంకో మెలిక పెట్టబడింది.. అదేమిటంటే, మిగతా SC-A, SC-D కేటగిరీలో ఎవరూ అభ్యర్థులు లేకపోతే,, ఆ అవకాశాలు కూడా, SC-B కి కేటాయించబడతాయి.. అంటే.. పరోక్షంగా,, మిగతా కులాల అవకాశాలు కూడా మాదిగలకే దోచి పెట్టె విధంగా చేయబడిన కుట్ర అని అర్థం చేసుకోవచ్చు..


      ముఖ్యంగా SC-A లోని కులాలు చూస్తే.. ఆ కేటగిరీలో 12  కులాలను చేర్చి, వారికి 1% రిజర్వేషన్లు కేటాయించబడింది..  అందులోని కులాలు


1. రెల్లి.                  2. బవురి/యవురి.       

 3. ఛండాల.          4. దండాసి

5. ఘాసి/ హడ్డి      6. డోమ్/దోంబర/పైడి.    

7. ఛచండి             8. గోడగాలి

9. మెహతర్.        10.పాకి/ మొటీ/తోటి.  

11.పమిడి.           12. సపురు


      వీరిలో ఒక్క రెల్లి తప్ప, మిగతా ఏ కులం కూడా, బడి ముఖం చూసి ఎరగరు.. వీటితో పాటు SC- A,B,C,D ల్లో అనేక కులాలు సంచార కులాలుగా జీవనం సాగిస్తున్నాయి.. వీరికి సంబందించిన సమగ్రమైన జనాభా లెక్కల సేకరణ కూడా చాలా కష్టంతో కూడుకున్న పని.. 


    కనీసం ప్రాథమిక స్థాయి విద్య కూడా అందుకోలేకపోయిన,, ఈ కులాలకు ఇంటర్మీడియట్ తర్వాత ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీల్లో ప్రవేశాల సమయంలో మాత్రమే ఉపయోగపడే వర్గీకరణ వలన, ఏ మాత్రం ఉపయోగం ఉండదు.. గ్రూప్-4 పోస్టులకు కూడా ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత ఉండాల్సిన అవసరం ఉన్న ఈ రోజుల్లో,, కనీసం బడి మెట్లు ఎక్కని ఈ కులాలకు ఉద్యోగాలు దక్కే అవకాశమే లేదు.. 


      కాబట్టి,, అభ్యర్థులు ఎవరు లేరు, అనే నెపంతో,, వీరి అవకాశాలను కూడా అప్పనంగా మాదిగలకు దోచి పెట్టడమే, వర్గీకరణ చట్టం ద్వారా చేయబడిన కుట్ర.. వర్గీకరణ అమల్లో ఉన్నన్ని రోజులు,, ఇలా 58 కులాల అవకాశాలు మాదిగలు మాత్రమే దక్కించుకున్నారు.. ఒకటో రెండో ఉద్యోగాలు, అదీ కింద స్థాయి ఉద్యోగాలు మాత్రమే రెల్లి కులస్తులకు మాత్రమే దక్కాయి.. మిగతా 56 కులాలకు కనీస అవాకాశం దక్కలేదు.. అలా 58 కులాల అవకాశాలను అప్పనంగా, కష్టపడకుండా అనుభవించే అవకాశం, వర్గీకరణ చట్టం రద్దుతో, పోవడంతో మాదిగలు 25 సంవత్సరాల నుండి ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు.. 


👉 బడి మెట్లు కూడా ఎక్కని కులాలను బడికి పంపించే శక్తి వర్గీకరణకు ఉందా ..??


     దీనికి సమాధానం లేదు అని చెప్పాలి.. మాల మాదిగ రెల్లి తప్ప మిగతా SC కులాలు వెనకబడడానికి ముఖ్య కారణం, వారికి మౌలిక వసతులు అయిన, విద్య, వైద్యం, ఆవాసం లాంటివేమీ అందుబాటులో ఉండకపోవడం,, వారి సంచార జీవనవిధానం లాంటి ఎన్నో కారణాలు ఉన్నాయి.. 


     వర్గీకరణ చట్టం ఆ కారణాలను శోధించి తొలగించే ప్రయత్నమే చేయలేదు.. మాల, మాదిగ, రెల్లి కులస్తులకు లాగా మిగతా 56 SC కులాలలో కూడా రిజర్వేషన్లు ఉపయోగించుకునే సామర్ధ్యాన్ని పెంచేందుకు ప్రణాళికలు ఏమీ లేకపోగా,, వీరి దీనమైన స్థితిని, మాదిగలకు అనుకూలంగా మలిచే నీచమైన ఆలోచన చేయబడింది.. 


     జాతీయ SC కమీషన్ కూడా వర్గీకరణ చట్టం మీద పైన చెప్పిన పరిశీలనలు చేసి, పార్లమెంట్ కు సమర్పించింది.. వర్గీకరణ ద్వారా మాల- మాదిగ - రెల్లి కులాలకు తప్ప మరే కులానికి న్యాయం చేసే అవకాశమే లేదు అని చెబుతూ,, 55 SC కులాలకు నిజంగా న్యాయం చేయాలంటే,, కింది సూచనలు చేసింది..


- వారికి గడప వద్దకు మౌలిక వసతులు చేర్చి,, వారిలో రిజర్వేషన్లు ఉపయోగించుకునే సామర్ధ్యాన్ని పెంచాలి..

- SC నిధుల నుండి వెనుకబడిన SC కులాలకు ప్రత్యేక కేటాయింపులు చేయాలి..

- SC పథకాలలో,, ఈ వెనుకబడిన SC కులాలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక పధకాలు రూపొందించాలి..


     ఈ విషయం చెబుతూనే,, SC కమీషన్, సుప్రీం కోర్టు చూపిన ఒక పరిశీలనకు నొక్కి చెప్పింది.. అదేమిటంటే..


" SC లలో 56 కులాలు, అవకాశాలు కూడా దక్కించుకోలేని స్థాయిలో వెనుకపడి ఉన్నారు కాబట్టి,, ఆ కులాల అవకాశాలను మాదిగ కులానికి కట్టబెడతాము అంటే,, ఆ 56 కులాలు అభివృద్ధి చెందితే, అదనపు లబ్ది కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి,, మాదిగలు ఆ 56 కులాల అభివృద్ధికి సహకరించే అవకాశం లేదు "..  


     25 సంవత్సరాల వర్గీకరణ ఉద్యమం సుప్రీంకోర్టు చేసిన ఆ పరిశీలన నిజం అని నిరూపించింది.. 25 సంవత్సరాల నుండి 59 ఉపకులాల పేరుతో వర్గీకరణ ఉద్యమం చేస్తున్న మాదిగ సంఘాలు,, ఏనాడు కూడా,, 56 కులాల సామర్ధ్యం పెంచేందుకు కృషి చేయమని ప్రభుత్వాలను అడిగిన పాపానికి పోలేదు.. ఎంతసేపు, వారి పేరు చెప్పుకుని, అదనపు లబ్ది పొందాలనే దురాశ మాత్రమే చూపించింది.. 


     దీనితో పాటు,, సుప్రీం కోర్టు, మరియు జాతీయ SC కమీషన్ ఇంకో పరిశీలన కూడా చేసింది.. అదేమిటంటే.. "మిగతా SC కులాలు సామర్ధ్యాన్ని పెంచుకున్న తరువాత,, వాళ్లకు న్యాయంగా, రాజ్యాంగపరంగా ఇవ్వబడిన 15 % అవకాశాలను 1% తగ్గించి పరిమితులు విధించడం వలన,, వారు ఒక్కో అవకాశం కోసం దశాబ్దాలు, శతాబ్దాలు ఎదురు చూడాల్సి వస్తుంది.. రాజ్యాంగపరంగా సంక్రమించిన ఆ హక్కుల మీద పరిమితి విధించడం కూడా ఒక రకమైన వివక్షతా చర్య, మరియు వారి అభివృద్ధికి అడ్డు అవుతుంది" అని.. 


    ఈ పరిశీలన చాలా ముఖ్యం అయినది... కింది ఉదాహరణలో 56 SC కులాలకు జరగబోయే అన్యాయం ఏమిటో చూద్దాం..


👉 వర్గీకరణ అంటే.. మాల మాదిగేతర 58 కులాల నోట్లో మట్టి కొట్టినట్టే.. 👈


       15 శాతం ఉన్న అవకాశాన్ని 1% తగ్గించడం వలన కలిగే ప్రమాదం గురించి ఒక ఉదాహరణ ద్వారా చెబుతాను.. మన రాష్ట్ర అసెంబ్లీనే తీసుకుందాము.. మొత్తం 175 నియోజకవర్గాల్లో 29 నియోజకవర్గాలు SC రిజర్వుడు..


వర్గీకరణ చట్టం ద్వారా సీట్లు కేటాయించాల్సి వస్తే..


SC- A కి 3       అంటే  12 కులాలకు 3 సీట్లు

SC -B కి 13     అంటే  18 కులాలకు 13 సీట్లు

SC- C కి 10     అంటే  24 కులాలకు  10 సీట్లు

SC - D కి 3      అంటే   5 కులాలకు   3 సీట్లు


   ఇందులో A కేటగిరీలో కేవలం రెల్లి కులస్తులకు, B కేటగిరీ లో కేవలం మాదిగలకు, C కేటగిరీలో కేవలం మాలలకు, D కేటగిరీలో అది ఆంధ్ర కులానికి తప్ప,, మిగతా 55 కులాల నుండి జీవితాంతం చట్టసభలకు ఒక్క అభ్యర్థి కూడా వెళ్లే అవకాశమే లేదు.. అంటే ఒక్కో కేటగిరీకి ఒకటి చొప్పున 4 కులాలే మళ్లీ మళ్లీ లబ్ది పొందుతూ ఉంటాయి.. ఇది సమాన న్యాయం ఎలా అవుతుంది.. ??


👉       దేనిని బట్టి అర్థం అవుతుంది ఏమిటంటే.. SC వర్గీకరణ వలన 60 SC కులాలకు సమన్యాయం జరుగుతుంది అనేది అబద్ధం.. SC వర్గీకరణ కేవలం మాదిగల ప్రయోజనాల కోసం మాత్రమే.. 59 SC కులాల పేరు చెప్పి మాదిగలే.. అప్పనంగా 9% దక్కించుకోవాలని చేసే కుటిల ప్రయత్నం మాత్రమే.. 


👉     ఒక కులానికి అదనపు లబ్ది చేకూర్చడం కోసం,, 59 కులాల నోట్లో మట్టి కొట్టాలని చూడడం,, దారుణమైన అన్యాయం.. 


👉     ఒక కులానికి అదనపు లబ్ది చేకూర్చడం కోసం,, 59 కులాలకు అవకాశాలను శాశ్వతంగా దూరం చేయాలని చూడడం ఘోరమైన అన్యాయం..


👉      SC ఉపకులాల మీద ప్రేమ ఉన్న ప్రతీ ఒక్కరు,, వర్గీకరణను వ్యతిరేకించి తీరాల్సిందే.. 


జై భీమ్..!! జై భారత్..!!

మాలల వృత్తులు

 ⚛️🔷 మాలలు - అనుబంధ వ్యవస్థ 🔷⚛️ ⚛️🔷 మాల కులపు వృత్తుల చరిత్ర 🔷⚛️ 🔹👉 కులవ్యవస్థకు ప్రత్యామ్నాయ వ్యవస్థ..మాల అనుబంధ వ్యవస్థ 👈🔹       మ...